![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షోకి ఈ వారం "కాలింగ్ సహస్ర" మూవీ టీమ్ నుంచి హీరోయిన్ డాలీషా, డైరెక్టర్ అరుణ్, యాక్టర్ రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళతో గేమ్స్ ఆడించింది సుమ. ఇక మధ్యలో సుధీర్ పెళ్లి విషయం అడిగేసరికి రష్మీతో జరిగిన మ్యారేజ్ చాల బెస్ట్ మ్యారేజ్ అని చెప్పాడు. స్క్రీన్ మీద సుడిగాలి సుధీర్ మ్యారేజ్ పిక్స్ ప్లే చేశారు. "సరే ఇన్ని సార్లు పెళ్లిళ్లు ఐపోయాయి కదా.. మరి నీ మెడలో ఆ మాలలు పడేదెప్పుడు రియల్ లైఫ్ లో " అని సుమ అడిగేసరికి.." ఏమో మేడం ప్రస్తుతం కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నా మేడం...పెళ్లి అనేది ఇంకా నా మైండ్ లో లేదు" అని చెప్పాడు.
"మూడు రకాల పెళ్లిళ్లు చేసుకున్నావ్ కదా అందులోని బెస్ట్ మ్యారేజ్ ఏది.." అని సుమ అడిగేసరికి " రష్మితో అహ నా పెళ్ళంటా షోలో జరిగిన పెళ్లి నాకు ఇష్టం " అని చెప్పాడు సుధీర్. దానికి సుమ "నేను రాజీవ్ కూడా ఇంత ఘనంగా పెళ్లి చేసుకోలేదు" అని చెప్పేసరికి సుధీర్ నవ్వేసి "టీవీ వాళ్ళు చేస్తున్న ఈ పెళ్లిళ్లు చూసి మా ..ఇంట్లో వాళ్ళు, చుట్టాలు అప్పుడప్పుడు అంటుంటారు.. అక్కడే పెళ్లి చేసుకో వాళ్ళే బాగా చేస్తున్నారు ఖర్చు లేకుండా" అంటుంటారు అని చెప్పాడు.
తర్వాత వాళ్ళ ఫామిలీ పిక్ ని వేశారు. "స్క్రీన్ మీద పంచ్ డైలాగ్స్ , అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీలవుతారు" అని అడిగింది సుమ.."మా అమ్మ ఒకటే చెప్పేది..నువ్వుంతసేపు జనాల్ని నవ్విస్తున్నావు..వాళ్ళను ఆరోగ్యంగా ఉంచుతున్నావ్..అది చాలు..నువ్వు చేసేది కరెక్టే" అంటుంటుంది అని చెప్పాడు. తర్వాత చిరంజీవితో, పవన్ కళ్యాణ్ దిగిన ఫొటోస్ చూపించేసరికి "లైఫ్ లో వీళ్ళతో ఇలా పక్కన నిలబడి ఫొటోస్ దిగడం కంటే మించిన ఆనందం లేదు" అని చెప్పాడు. ఇక సుధీర్ ఫ్యాన్ పేజెస్ ని ప్లే చేసి చూపించింది సుమ. అది చూసి కాలింగ్ సహస్ర టీమ్ మొత్తం షాకయ్యింది. ఈ ఫ్యాన్ పేజెస్ ఇంకా పెరగాలని కోరుకుందాం అని సుధీర్ ని విష్ చేసింది సుమ.
![]() |
![]() |